కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైన అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి. మంగళవారం ఉదయము గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ తమ ట్రాక్టర్ మరియు ట్రైలర్స్ నందు అక్రమంగా, దొంగతనముగా గొల్లపల్లి శివారులోని వాగు నుండి ఇసుక తరలిస్తుండగా అతడిని ట్రాక్టర్ తో సహా పట్టుకొని కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్ట్ కు పంపినట్లు రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.