.భారత దేశం ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందని, అందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలే కారణమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. నేడు దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని, ఈ దేశాన్ని కాపాడాలంటే కమ్యూనిస్టు పార్టీలు బలోపేతం కావాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర 28 వ మహాసభలలో సోమవారం ముఖ్య వక్తగా హాజరైన రాజా మహాసభ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏ రాజకీయ కారణంతో ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారో ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.