ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట గ్రామ సమీపంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఓ లారీ క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ టీ తాగినందుకు వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా డ్రైవర్ తెలిపాడు. జార్ఖండ్ నుంచి తమిళనాడుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ఆ సమయంలో లారీ క్యాబిన్ లో లేకపోవడం వల్ల ప్రాణాలు దక్కినట్లుగా లారీ డ్రైవర్ తెలిపాడు.