మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు విధిగా పాఠశాలలు తనిఖీలు చేయాలని తనిఖీల వివరాలు విధిగా స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ లో నమోదు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య తెలిపారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రాధాన్ ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ గుర్తింపు హాజరులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.