గురుపూజోత్సవం సందర్భంగా 1980 సంవత్సరంలో తపోవనం పాఠశాల నందు చదువుకున్న పూర్వ విద్యార్థులు తపోవనం వృద్ధాశ్రమంలో శనివారం తమ గురువులను స్మరిస్తూ పాదాభివందనం చేసి పుష్పాలతో నమస్కరించారు అనంతరం వారికి దుస్సాలవను కప్పి ఉపాధ్యాయులకు కిరీటాన్ని ధరింపచేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తపోవనం ఉపాధ్యాయులు ఎన్ని సంవత్సరములు అయినను గుర్తుంచుకొని వచ్చి తమ ఆశీర్వాదాలు పొందడం మనసుకు చాలా ఆనందంగానూ గర్వకారణంగా ఉందని పూర్వపు విద్యార్థులను ఆశీర్వదించారు