ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నయని జిల్లా ఎస్పీ గౌష్ అలం అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలకు ఆయన పరిశీలించారు. 20 పోలింగ్ లొకేషన్ లలో 39 పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల కోసం 400 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉందన్నారు. సాయంత్రం ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు.