ఫోన్ కాల్ అందగానే ఆలస్యం లేకుండా రోగులకు సేవలు అందించి..విలువైన ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం పుట్టపర్తి కలెక్టరేట్ ప్రాంగణంలో నూతన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ ను కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ 108 అంబులెన్స్ లోపలికి వెళ్లి అందులో ఉన్న అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ పరికరాలను, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు