ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొమురం భీం ప్రాజెక్టులోకి 3,457 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం కొమురం భీం ప్రాజెక్టు ఒక గేటును 0.3 మీటర్ మేర ఎత్తి 618 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. కొమురం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 కు చేరుకుంది.