పినతండ్రిని గొడ్డలితో నరికి చంపి అబద్ధాలాడిన వ్యక్తి మరియు పదవీ వ్యామోహంలో కన్నతల్లిని తోబుట్టువుని ఇంటి నుంచి గెంటేసిన వ్యక్తి చెప్పేవి నిజాలని ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన టిడిపి సమావేశంలో పాల్గొన్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు జరిగిన మేలు గత ప్రభుత్వాలలో ఎప్పుడు జరగలేదన్నారు మహిళలంతా సంతోషంగా కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతుంటే అది తట్టుకోలేక ఏవేవో లేని పోయిన అబద్ధాలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు