గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సమస్యకు కారణం అవుతున్న వాలంటీర్ విధులను బహిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక తీర్మానం చేసింది. శనివారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల బాధను పలుమార్లు అధికారులకు వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో పాటు రోజు రోజుకూ,ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని మరింత దిగజారుస్తూ,రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ప్రాణ వాయువు లాంటి సచివాలయ ఉద్యోగుల శక్తిని నిర్వీర్యం చేసేలా అధికార వర్గాలు ప్రవర్తిస్తున్న తీరును ఖండించారు.