భీమిలి నియోజకవర్గంలో ప్రత్యేక మహిళ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్.ఈ.జెడ్.) ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకువెళ్లగా తన అంగీకారాన్ని తెలియజేశారన్నారు. మధురవాడ వి - కన్వెన్షన్ లో గురువారం నిర్వహించిన స్త్రీ శక్తి పథకం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి మహిళలకు టీడీపీ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఆస్తిలో సమాన వాటా హక్కు.. మహిళ రిజర్వేషన్లు.. వంటి విప్లవాత్మక సంస్కరణలతో మహిళ సంక్షేమం దిశగా పాటుపడిన తెలుగుదేశానికి తెలుగింటి ఆడపడుచులు వెన్నెముకగా అభివర్ణించారు.