పల్నాడు జిల్లా,దాచేపల్లి మండలం, పొందుగుల వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియాను,గ్రానైట్ లారీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.చెక్పోస్ట్ వద్ద గురువారం తనిఖీలు చేస్తుండగా సరైన పత్రాలు లేకపోవడంతో రెండు గ్రానైట్ లారీలను, రెండు మినీ లారీల్లో యూరియాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పల్నాడు ప్రాంతంలోని ఓ వ్యాపారి నుండి సరైన పత్రాలు లేకుండా తెలంగాణ తరలిస్తున్న నేపథ్యంలో రెండు టాటా ఏసీలను పట్టుకుని కారంపుడి కి చెందిన వ్యాపారిని దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.