రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వగ్రామమైన గంట్యాడ మండల కేంద్రంలోని వినాయకుని ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకుని తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వినాయకుని కోరుకుంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా భోజనాలు వడ్డించారు. మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, గంట్యాడ పీఏసీఎస్ అధ్యక్షులు బూడి గాంధీ, పాల్గొన్నారు.