తాడిపత్రిలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. నంద్యాల రోడ్డు నుంచి తాడిపత్రికి వస్తున్న లారీని డ్రైవర్ నాగరాజు సజ్జలదిన్నె వద్ద రాత్రి ఆపి క్యాబిన్లో నిద్రపోయాడు. ఉదయం దుకాణాల వారు వెళ్లి చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ శివ గంగాధర్ రెడ్డి అక్కడికి చేరుకొని పరిశీలించారు. బంధువులకు సమాచారం అందించారు. మృతికి గల కారణం తెలియాల్సి ఉంది.