అల్లూరి జిల్లా పెదబయలు మండలం కేంద్రం లో ప్రధాన రహదారికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పెద్దబయలు వారపు సంత కారణంగా వాహనాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుకి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయి భారీ గోతులు ఏర్పడడంతో అటువైపుగా వెళ్లే వాహనాలు ప్రమాదాలు గురవుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు అపూర్వ రోడ్డు నిర్మించి లేదా వెడల్పు రోడ్డును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.