రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని భారీ వర్షం గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసింది భారీ వర్షం దాటికి పద్మావతి కాలనీలో ఇంటి పునాది కొట్టుకుపోయింది. మెల్లగా భవనం పక్కకు వాలుతుందని స్థానికులు వాపోయారు. ఇంకోవైపు ఇంటిపై 11 కేవీ కరెంటు స్తంభం ఒరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు పలువురు తెలిపారు.