గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వాయి (ఫిట్స్) రావడంతో ఓ వ్యక్తి కుప్పకూలి కింద పడ్డాడు. రోడ్డుపై బలంగా పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కిందపడ్డ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.స్థానికులు గమనించి వెంటనే రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. అనంతరం అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.