గత వైసిపి హయాంలో ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అమలు చేయటం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అమలు చేయడం లేదని వైఎస్ఆర్సిపి గుంటూరు పట్టణ అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా మండిపడ్డారు. ఇదే అంశంపై వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ను కలిసి వినతి పత్రం సమర్పించారు.