సూర్యాపేట జిల్లా: ఉపాధ్యాయులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు శనివారం భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పి అర్ సి ని వెంటనే అమలు చేయాలని పెండింగ్లో ఉన్న డీడీలు వెంటనే విడుదల చేయాలన్నారు. సిపిఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూరపాటి రవీందర్, కాకి సీనియర్ డిమాండ్ చేశారు.