మాచర్ల రూరల్ PSలో పనిచేస్తున్న AR కానిస్టేబుల్ షరీఫ్పై ఓ మహిళ అసభ్య ప్రవర్తన చేస్తున్నాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపం చెందిన షరీఫ్, బుధవారం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో షరీఫ్ తనపై అబద్ధపు ఆరోపణలు చేశారని, తన డబ్బును కాజేశారని వాపోయాడు. ఘటనపై రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.