ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పరిధిలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీఐ ప్రభాకర్ రావు సూచించారు. రాజకీయాలకతీతంగా భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు బాధ్యత వహించాలన్నారు. శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించాలని పేర్కొన్నారు.