అల్లూరి జిల్లా హుకుంపేట మండలం కొంతిలి నేషనల్ హైవే 516ఇ జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హుకుంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాడేరు నుండి హుకుంపేట వైపుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని హుకుంపేట నుండి పాడేరు వైపుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.