జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), బలగను సందర్శించి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితి, అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న పరిసరాలను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. పౌష్టికాహార సరఫరా, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.