జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సర్కిల్ పరిధిలోని ఆరవ డివిజన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వివిధ పరీక్షలు చేయించుకున్నారు. డిసి జగన్, డాక్టర్ మధుసూదన్ రావు, ఎస్ ఎస్ సుదర్శన్, ప్రభుత్వ వైద్యులు రమాదేవి,విజయ రాణి ప్రసన్నకుమారి నర్సులు శోభారాణి,మంజుల తదితరులు వైద్య సేవలు అందించారు.