తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గురువారం వెంకటగిరి పోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటగిరి పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేట ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎంతో చక్కగా వెంకటగిరి జాతర కార్యక్రమాలను చేపట్టిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మీడియాతో మాట్లాడారు.