గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎడ్ల బజార్లో మంగళవారం నిర్వహించిన నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం నూతన కార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు. మండలంలో 9227 మంది కొత్త మెంబర్లను కార్డులలో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మండల డిప్యూటీ తహసిల్దార్ రాజు పాటిల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.