డోన్ పట్టణానికి చెందిన లాయర్ లక్ష్మణ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర నాయుడు, లాయర్లు అరుణ్ రామలింగం, రవికుమార్, శివరామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్, ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు.