భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 15న విజయవాడలో రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ముట్టడిని జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది.కర్నూలు నగర ఆర్ఎస్ రోడ్ జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. సిఐటియు నాయకుడు జి.ఏసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.నరసింహులు, నగర నాయకుడు ఎస్ఎండి మహ్మద్ రఫీ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – భవన నిర్మాణ కార్మికులు పనులేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరక