యాదాద్రి భువనగిరి జిల్లా: మార్వాడి గో బ్యాక్ నినాదాలతో వలిగొండలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మార్వాడీల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు వర్తక సంఘాలన్నీ స్వచ్ఛందంగా ఇబ్బందులో పాల్గొన్నాయి. వర్తక సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షుడు కొండపర్తి బాలా చారి అధ్యక్షుడు బెల్లీద శ్రీను గజ్జల అమరందర్ సంతోష్ మహేష్ మాట్లాడుతూ మార్వాడిల వ్యాపార విధానాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.