రోగులకు రిఫర్ ద్వారా ఆర్ఎంపి పిఎంపీలకు ఆసుపత్రి నుండి వచ్చే కమిషన్లను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన జీవోను స్వాగతిస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్ నాయకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయన భవనంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంతా మాస్ లైన్ నాయకులు శుక్రవారం మధ్యాహ్నం 3:20 విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. చికిత్స కోసం ఆసుపత్రులకు ఆర్ఎంపీలు పీఎంపీల ద్వారా వచ్చే రోగుల వద్దనుండి కమిషన్లు బంద్ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ అధికారులు విడుదల చేసిన సర్కులర్ ను నాయకులు స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు.