తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం పవిత్రోత్సవాలు ముగింపు సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా పూర్ణాహుతి కార్యక్రమం, కలశ స్థాపన గావించి శ్రీ కాల హస్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పవిత్ర మాలలు భక్తులకు అందజేసిన ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి ఆలయ ఏఈఓ మోహన్ ఆలయ పిఆర్ఓ రవి ఆలయ సిఎస్ఓ సుదర్శన్ పాల్గొన్నారు