ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వం నిర్వహించాలని సిపిఎం కొమరాడ మండల కార్యదర్శి కే. సాంబమూర్తి అన్నారు. ఆదివారం కొమరాడ మండలంలో గిరిజన సంఘ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం 10 వైద్య కళాశాలలో పి పిపి పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది అన్నారు. దాన్ని విరమించుకోవాలన్నారు. ఇప్పటికే విద్య ప్రైవేట్ పరం అయిందని. ఇప్పుడు వైద్యం కూడా ప్రైవేటుపరం చేయటం సరికాదన్నారు.