హుజురాబాద్ : పట్టణంలో విధి కుక్కల బెడద ఎక్కువ కావడంతో వాటి నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కుక్కలను పట్టుకోవడానికి యుపి నుండి ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దించారు.పట్టణంలోని పలు విధుల్లో తిరుగుతూ వలల సహాయంతో వాటిని పట్టుకొని ఎనిమల్ బర్త్ కంట్రోల్ కు తరలించారు. వాటిని ఒక రోజు అబ్జర్వేషన్ లో పెట్టీనా అనంతరం స్టెరిలైజేషన్ తరువాత వ్యాక్సిన్ ఇచ్చి తిరిగి అదే ప్రదేశం లో వదిలి పెడతామని అంటున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు డాగ్ క్యాచ్ ప్రత్యేక టీం సభ్యులు పాల్గొన్నారు.