-పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని జగిత్యాల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీమతి రత్న పద్మావతి మంగళవారంఉదయం దర్శించుకున్నారు.వీరికి దేవస్థానం పక్షాన పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు , వేద పండితులు స్వాగతం పలికారు.ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం వేదంపండితులు ఆశీర్వచనం అందించగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్ లు శ్రీ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించారు.