భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆయన తల్లిని దుర్భాషలాడిన రాహుల్ గాంధీని అరెస్టు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని కఠినంగా శిక్షించాలన్నారు. అదేవిధంగా బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటి అనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తుందని ఎద్దేవా చేశారు.