నల్లగొండ జిల్లా: హైదరాబాదు నుంచి నల్లగొండ వస్తున్న టీజీ ఆర్టీసీ బస్సు నల్లగొండ బైపాస్ నుంచి పట్టణంలోకి వెళ్తున్నప్పుడు అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీ కొట్టిందని ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.