గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం, అన్నపర్రు గ్రామంలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పొలం పనులకు వెళ్లి వస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు మృతి చెందారు. మృతులు నాగమ్మ, సామ్రాజ్యం గా గుర్తించారు. సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ రెవిన్యూ సిబ్బంది వివరాలు సేకరించారు.