చందూర్ మండలం లోని ఘన్ పూర్ గ్రామానికి చెందిన యువతి తనను ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు వర్ని ఎస్ఐ మహేష్ వెల్లడించారు. వర్ని మండలం కూనిపూర్ క్యాంపు నకు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని మనస్తాపం చెంది శుక్రవారం ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లు ఎస్సై తెలిపారు. స్థానికులు బాధితురాలని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బాధితురాలి అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.