యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి గొప్పదని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ వర్ధంతిని సందర్భంగా భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.చాకలి ఐలమ్మ చరిత్రను నేటి తరం అధ్యయనం చేయాలన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.