ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఇసుక దందాను అరికట్టడానికి అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఇసుకాసురుల్లో ఇసుమంతైనా మార్పురావడంలేదని DYFI జిల్లా కార్యదర్శి టికానంద్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ..ASF మండలంలోని చిర్రకుంట గ్రామ సమీపంలోని వాగుల నుంచి ట్రాక్టర్ లలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. వాగుల నుంచి ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని, దీంతో నీటి కొరత ఏర్పడుతుందని రైతులు, గ్రామస్థులు,ఆందోళన వ్యక్తం చేసున్నారని పేర్కొన్నారు.