తెలంగాణ రైతాంగానికి సాగుకు నీళ్లు తెచ్చిన వాళ్ల మీదనే నిందలు వేయడం సిగ్గుచేటని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ ఆదేశానుసారం మంగళవారం బాధనకుర్తి గోదావరి బ్రిడ్జి వద్ద బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.