గూడూరు విద్యుత్ శాఖ అధికారులు వినాయక మండపాల నిర్వహణ, నిమజ్జనంపై పలు సూచనలు చేశారు. విద్యుత్తు లైన్ల కింద విగ్రహాలను ఏర్పాటు చేయకూడదన్నారు. ఎత్తైన విగ్రహాలను విద్యుత్తు లైన్ల కింద తీసుకెళ్లకూడదని తెలిపారు. మండపాల్లో ఏర్పాటు చేసే విద్యుత్తు అలంకరణకు నాణ్యమైన పరికరాలను వినియోగించాలని సూచించారు. విద్యుత్తు చార్జీల నిమిత్తం తగిన రుసుము చెల్లించి రసీదు పొందాలని వాయిస్ తో కూడిన మెసేజ్ వినిపించారు.