గాంధీనగర్ అంగన్వాడీలో కుళ్ళిన కోడిగుడ్ల ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ లో నిన్న కుళ్ళిన కోడిగుడ్లను పంచిన ఘటన పై పబ్లిక్ యాప్ లో వచ్చిన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసి కోడి గుడ్లను నేడు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు పరిశీలించారు. కాంట్రాక్టర్ ను ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరించమన్నారు.