తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణములోని 13వ వార్డు శివాలయం గుడి వెనుక నందు టీవీఎస్ స్వచ్ఛంద సంస్థ మరియు మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో బుధవారం కైవల్య నదిని పరిశుభ్రం చేసే పనులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ కైవల్య నది పరి శుభ్రంగా ఉంచుకుంటే పోలేరమ్మ జాతరకు అన్ని విధాల బాగుంటుంది అన్నారు ఈ కార్యక్రమం లో AMC ఛైర్మన్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, మున్సిపల్ కమిషనర్, తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిలు, రాష్ట్ర, నియోజకవర్గం అనుబంధం కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు టీవీఎస్ సంస్థ సిబ్బంది తదితరులు పొల్గొన్నరు