జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారంపల్లి వద్ద, బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ - రాయపట్నం ప్రదాహన రహదారిపై బైటాయించి,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. సుమారు ఇరవై నిమిషాల పాటు రోడ్డుపై కూర్చొని,ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపిచారు. ఈ సందర్బంగా పలువురు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో, పబ్బం గడుపుతోందని మండిపడ్డారు.