ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలు నేపథ్యంలో గోదావరి నదికి వరదనీరు పోటెత్తడంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వే గత కొన్ని రోజుల క్రితం వరద ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక వంటి లంక ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధవలేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కాజ్వేపై వరద నీరు తొలగి స్థానికులు ఆదివారం రాకపోకలు సాగిస్తున్నారు.