Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మెరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు బిజెపి మండల అధ్యక్షుడు రాజుతో కలిసి చేపట్టిన కార్యక్రమంలో ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.