వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని శుక్రవారం కడప జిల్లా కమలాపురం సిఐ రోషన్, ఎస్సై విద్యాసాగర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.నిమజ్జనం నిమిత్తం వెళ్ళే ప్రతి వాహనానికి రికార్డు ఖచ్చితంగా ఉండాలన్నారు. నిమజ్జనం దగ్గర చిన్నపిల్లలను తీసుకెళ్ళ వద్దని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.