ఋషికొండ వద్ద ప్రైవేట్ లాడ్జి గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సంపత్ వినాయక్ రెడ్డి (27) ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. దొండపర్తిలో నివాసం ఉంటూ వినాయక్ రెడ్డి బజాజ్ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఉరివేసుకుని మృతి చెందినట్లు తన తండ్రి తెలిపినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. తండ్రి శంకర్ రామ్ పిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.