ఎర్రవల్లి మండల పరిధిలోని జింకలపల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను లారీ వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెనక సీట్లో కూర్చున్న ధీరజ్ అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ మూత్ర విసర్జన కోసం నిలపగా వెనకాల నుంచి అతివేగంగా లారీ వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.